BREAKING
అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్ లో పెరుగుతున్న ఆదరణ

చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం

పూసపాటిరేగ, సూర్య :  ప్రతి పల్లెలో కోదండ రామాలయాలు నిర్మాణాల ద్వారా ఆధ్యాత్మిక పరిపక్వత విక్షిస్తుందని కోట్ల ఆధ్యాత్మిక భావం. ఆలయాలలో సింహభాగం రఘు నిర్మాణంలో అత్యధికంగా ఆర్థిక సాయం చేసినవేనని చెప్పవచ్చును. నెల్లిమర్ల నియోజకవర్గం లోని సీనియర్ జనసేన నాయకుడు, కొవ్వాడ పంచాయతీ మాజీ సర్పంచ్ కోట్ల రఘు చోడమ్మ అగ్రహారం  శివారు గ్రామమైన గైతుల చోడవరం శ్రీ కోదండ రామాలయాని రూ.50 వేలు ఆలయ నిర్మాణ కమిటీ నిర్వాహకులకు శనివారం అందజేశారు. గతంలో వెల్దురు పంచాయతీ కిలిగుపేట గ్రామ శ్రీ కోదండ ఆలయానికి రఘు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయగా, వెంపడం పంచాయతీ తాళ్ల పేట గ్రామానికి శ్రీ కోదండ రామాలయానికి రూ. లక్ష అందజేశారు. అదేవిధంగా కండివలస శ్రీ కోదండ రామాలయం అని కూడా రూ.30 వేలు అందజేసిన రఘు గుంపాం  పంచాయితీ శివారు గ్రామమైన తొత్తడంలో నిర్మించనున్న కోదండ రామాలయ నిర్మాణానికి  కూడా భారీ మొత్తంలో రూ.2 లక్షలు అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రఘు, తన స్వగ్రామమైన కొవ్వాడలో నిర్మించనున్న శివాలయాన్ని కూడా భారీ మొత్తంలో ఆలయాన్ని నిర్మించేందుకు రఘు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా దేవతామూర్తులైన అమ్మవారు జాతర్లకు, అమ్మ బార్ల ఆలయ నిర్మాణాలు కూడా లక్షలాది రూపాయలను విచ్చిస్తూ ఆర్థిక సాయం చేసిన రఘు, అదే స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు కూడా లక్షలాది రూపాయలను కమిటీ నిర్వాహకులకు అందజేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భగవంతుడు తనకు ఇచ్చిన ఆర్థిక శక్తి మేరకు హార్దిక సాయం చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కోట్ల రఘు స్పష్టం చేశారు.

 

రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.