BREAKING
ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..! పొన్నూరులో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన* ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు. ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ

చంద్రగిరిలో 'మ్యూజికల్ చైర్'లా ఎంపీడీవో కుర్చీ: ఇన్-ఛార్జిల చేతుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ?

Select Suryaa Now
చంద్రగిరిలో 'మ్యూజికల్ చైర్'లా ఎంపీడీవో కుర్చీ: ఇన్-ఛార్జిల చేతుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ?

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ :తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) పోస్టు పరిస్థితి 'మ్యూజికల్ చైర్' ఆటకు నిదర్శనంగా మారింది. కొంతకాలంగా ఇక్కడ పూర్తిస్థాయి, శాశ్వత అధికారి లేకపోవడంతో పరిపాలన నిరంతరం ఇన్‌ఛార్జి అధికారుల తోనే నెట్టుకొస్తున్నారు.

ఇప్పటివరకు ఒక అధికారి స్థిరంగా పనిచేసిన దాఖలాలు లేకపోగా, ఇటీవల పనిచేసిన ఎంపీడీవో కూడా హఠాత్తుగా సెలవుపై వెళ్లడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న కీలక సమయంలో కీలకమైన మండల పరిపాలన బాధ్యతలను మళ్లీ ఇన్‌ఛార్జి అధికారికి అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికల నిర్వహణ, అధికార యంత్రాంగ సమన్వయం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంలో పూర్తిస్థాయి అధికారి లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతోందని స్థానికులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి