చిన్నారి కర్నాటి అనూరాధ వాసుకి జన్మదిన వేడుకలు: బుడంగుంట గిరిజన కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.
కావలి మేజర్ న్యూస్ : కావలి పట్టణంలోని ప్రముఖ కర్నాటి మల్టీ స్పెషాలిటీ వైద్యశాల వైద్యులు డాక్టర్ కర్నాటి రోహిత్ మరియు డాక్టర్ కర్నాటి నాగభార్గవి దంపతుల కుమార్తె చిన్నారి కర్నాటి అనూరాధ వాసుకి నాల్గవ పుట్టినరోజు సందర్భంగా సామాజిక బాధ్యతతో కూడిన ఉదార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని కావలి సమీపంలోని బుడంగుంట గిరిజన కాలనీలో నివసించే పేదలకు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు డాక్టర్ కర్నాటి రోహిత్ - డాక్టర్ కర్నాటి నాగభార్గవి దంపతులు, అలాగే సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మరియు స్థానిక గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డాక్టర్ కర్నాటి రోహిత్ మాట్లాడుతూ,
"గత కొన్ని సంవత్సరాలుగా సంయుక్త సేవా సంస్థతో కలిసి మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాం. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, దానిని పేదలకు సేవ చేసే అవకాశంగా మలుచుకోవడం అలవాటుగా మార్చుకున్నాం. అందులో భాగంగానే ఈ బుధవారం నా కుమార్తె అనూరాధ వాసుకి 4వ పుట్టినరోజు సందర్భంగా బుడంగుంట గిరిజన కాలనీలోని పేద ప్రజలకు అన్నదానం చేయడం మా కుటుంబానికి ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది. "బుధవారం నాడు నిరుపేదల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన దాతలు డాక్టర్ కర్నాటి రోహిత్ - నాగభార్గవి దంపతులకు సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెల్పుతున్నాం. బుధవారం 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చిన్నారి అనూరాధ వాసుకికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను ప్రసాదించాలని, తను భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.