చిల్లకూరు గ్రామంలో అభివృద్ధికి మరో ముందడుగు
గూడూరు, మేజర్‌న్యూస్ : పురపాలక సంఘంలో చేపడుతన్న హామ్ (హెచ్ఎఎం) పథకంతో చిల్లకూరులోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా చిల్లకూరు పరిధిలోని వడ్డీ పాలెం, గొల్లపాలెం, హరిజనవాడ, అరుంధతి వాడ, మిక్స్డ్ కాలనీ, శంకర గిరిజన కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. పురపాలక సంఘంలో కలసిన చిల్లకూరు పంచాయతీ పరిధిలో మూడు వార్డులుగా విభజన చేశారు. దీంతో ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం విశేషం. నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ సూచనలతో, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం కింద రూ.30 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనుల్లో భాగంగా, అభివృద్ధి పనుల ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలను గుర్తించి ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేకి, తానంకి నానాజీకి సహకరించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ పర్సన్ ఇన్‌చార్జ్ రామచంద్రారెడ్డి, నవీన్‌చంద్ర, రాజేంద్ర, శివ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.