BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

చెత్త నుంచి సంపద తయారీపై ఎక్స్‌పోజర్ విజిట్

Select Suryaa Now
చెత్త నుంచి సంపద తయారీపై ఎక్స్‌పోజర్ విజిట్

మార్టూరు, మేజర్ న్యూస్:

పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి గ్రామపంచాయతీలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం (SWPC) వద్ద ఎక్స్‌పోజర్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను బిన్‌ బ్యాగ్‌ పద్ధతిలో వేర్వేరుగా సేకరించడం, పొడి చెత్తను స్వచ్ఛ రథం ద్వారా తరలించడం, తడి చెత్తతో వర్మీ కంపోస్ట్‌ ఎరువును తయారు చేయడంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మార్టూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీల పంచాయతీ అభివృద్ధి అధికారులు (PDOలు), హరిత రాయబారులకు తడి చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్ట్‌ తయారీ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల సమర్థవంతమైన నిర్వహణపై పలు సూచనలు అందజేశారు.

ప్రతి గ్రామపంచాయతీలోని SWPC కేంద్రంలో నెలకు కనీసం ఒక టన్ను వర్మీ కంపోస్ట్‌ ఎరువును తయారు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులు సూచించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ,స్వచ్ఛ ఆంధ్ర  స్వర్ణ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో చెత్తను సంపదగా మార్చాలని పిలుపునిచ్చారు. వర్మీ కంపోస్ట్‌ తయారీని ప్రోత్సహించడం ద్వారా గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

నాగరాజుపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి పి. వెంకటేశ్వరరావు సమన్వయంతో కార్యక్రమం నిర్వహించగా, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. రామాంజనేయులు పాల్గొన్నారు.