చాముండేశ్వరి దేవి అలంకరణలో దివ్య దర్శనం..
శరన్నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాలను పురస్కరించుకుని మండలంలోని పాత ములకలచెరువు గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని శ్రీ చాముండేశ్వరి దేవి అలంకరణలో అత్యంత వైభవంగా అలంకరించారు. దుష్ట సంహారిణిగా, భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలువుదీరిన అమ్మవారు చాముండేశ్వరి దేవి రూపంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల దివ్య ఆభరణాలు అలంకరించి, ప్రత్యేక కుంకుమ పూజలు, విశేష పుష్పాలంకరణలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరణ చేపట్టారు. చాముండేశ్వరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దివ్యదర్శనంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె అన్నమయ్య జిల్లా