బుద్దవరం గ్రామంలో శ్రీనివాసరావు ప్రచార జోరు.. కూటమి, వామపక్షాల మద్దతుతో విజయమే లక్ష్యంగా ముందడుగు!
కృష్ణాజిల్లా , గన్నవరం మండలం, బుద్దవరం గ్రామంలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కూటమి, వామపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసరావుకు మహిళలు, యువత, గ్రామ పెద్దల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు ఆయనకు స్వాగతం పలుకుతూ తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.
గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతానని శ్రీనివాసరావు ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించడంతో పాటు అందరినీ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.
కూటమి, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీనివాసరావుకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండటంతో ఆయన ప్రచార శిబిరంలో నూతనోత్సాహం కనిపిస్తోంది. గ్రామంలో కొనసాగుతున్న ప్రచారానికి లభిస్తున్న స్పందన ఎన్నికల వేళ రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.