బోయిల్ల చిరువెళ్లలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : మండలంలోని బోయిల్ల చిరువెళ్లలో ఆత్మకూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి , కరటంపాడు ఎంపీటీసీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు గ్రామంలోని ప్రజలను, కుటుంబాలను నేరుగా కలుసుకుని తెలుగు దేశం పార్టీ విధానాలు, పార్టీ కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, స్థానిక సమస్యలపై చర్చిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.జెడ్పిటిసి మెంబర్ టిడిపి అభ్యర్థి డాక్టర్ తుమాటి శశిధర్ రెడ్డి, కరటంపాడు ఎంపిటిసి టిడిపి అభ్యర్థి దావా సుమన్యలను అందరూ ఆశీర్వదించి ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి విజయం చేకూర్చాలని, వారు గెలిచాక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సహకారం తో అభివృద్ధి చేస్తామని, ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వారి ప్రచారం ముమ్మరంగా సాగగా అన్నివర్గాలనుండి విశేషాదరణ లభించింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గార్లపాటి వేణుగోపాల్ నాయుడు, దావా పెంచలరావు, మంతు యానాది రెడ్డి, కొండ్రెడ్డి రమణా రెడ్డి, పూనుగుంట ధనుంజయ, హనీఫ్, నియోజకవర్గ టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షుడు షేక్ హనీఫ్,
సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలతో అభ్యర్థులు మమేకమై, స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.