బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగత ఏర్పాట్లు
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఇళ్ల పట్టాల పంపిణీపై బొండా సిద్ధార్థ
విజయవాడ సెంట్రల్, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్ : మంగళవారం ఉదయం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఘన స్వాగతం పలికేందుకు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రేపు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జోన్-30 ద్వారా క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేయనున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల కుటుంబాలకు, సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 6 వేల కుటుంబాలకు పట్టాలు అందనున్నాయి. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందేలా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పేదల ఇళ్లకు చట్టబద్ధమైన హక్కు కల్పిస్తూ పట్టాలు అందించడం ద్వారా వారి ఆస్తికి శాశ్వత భద్రత లభిస్తుందని, భవిష్యత్ తరాలకు కూడా ఆస్తి హక్కు ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొండా సిద్ధార్థ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, మాజీ కార్పొరేటర్లు ఫిరియా జగదాంబ, ఎరుబోతు శ్రావణి, గౌసియా, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.