BREAKING
సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ అందరూ ఆశీర్వదించి విజయం చేకూరిస్తే ఆత్మకూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా సెగ్మెంట్లో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు తనకు విజయ సోపానాలు - టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఖాజావలి తలకొండపల్లిలో ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు* గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమెందుకు?

బొబ్బేపల్లిలో టీడీపీలోకి భారీగా చేరికలు

Select Suryaa Now
బొబ్బేపల్లిలో టీడీపీలోకి భారీగా  చేరికలు

మార్టూరు, మేజర్‌న్యూస్‌ :
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో బొబ్బేపల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలన, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ బొబ్బేపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. టీడీపీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ దండా హరిబాబు, మాజీ ఉపసర్పంచులు సయ్యద్ మౌలాలి,షేక్ మాబు సుభాని,  నాయకులు పఠాన్ రఫీ ఖాన్, పఠాన్ మహబూబ్ సుభాని, షేక్ ఖాదర్ బాబు, పఠాన్ వలి, పఠాన్ ఫైజుల్లా, పఠాన్ మస్తాన్ వలి, కుంచపు అంజిబాబు, తన్నీరు ముసలయ్య, యాగంటి హరిబాబు, దండా అశోక్, చాగంటి కోటేశ్వరరావు, షేక్ బాషా, దండా రాజేష్, కుంచపు హనుమంతరావు, వల్లెపు సాయి, దండా సురేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబయ్య, శరత్, రామారావు, గంగా వీరయ్య, దండా శ్రీనివాసరావు, సుబ్బారావు, కోటేశ్వరరావు, ఉమా మహేశ్వర రావు,తాటి నాగేశ్వరరావు, శివరాత్రి శ్రీనివాసరావు, షేక్ రజాక్, జనార్ధన్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.