BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

భూసమస్యలను పరిష్కరించండి : శేషం సుదర్శన్

Select Suryaa Now
భూసమస్యలను పరిష్కరించండి : శేషం సుదర్శన్

అనంతసాగరం, మేజర్ న్యూస్  :      మండలం తహసిల్దార్ వీర వసంతరావును జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిసి వివిధ భూసమస్యలను వివరించారు. ఈ సందర్భంగా శేషం సుదర్శన్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఉన్న పెండింగ్ లో ఉన్న చిన్న, సన్నకారు రైతులు, పేదల భూములకు సంబంధించిన రికార్డుల విషయంలో ఉన్న అవకతవకలను పరిష్కరించాలని కోరారు. ప్రతి నెల చివరి వారంలో గ్రామాల్లో  నిర్వహించే పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాలకు మండల పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని గ్రామాలలో నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మార్వో వివరించారు. అంతేకాకుండా మహిళల భద్రత విషయాల్లో ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసుల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో గ్రామ సచివాలయంలోని అధికారులు ప్రత్యేకమైన చొరవతో పనిచేసేలా తగు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మార్వో కి సూచించారు. ఈ కార్యక్రమాలు శేషం సుదర్శన్ తో పాటు మినగల్లు కి సంబంధించిన రైతులు పాల్గొన్నారు.