BREAKING
చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ! తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం.

భివృద్ధే మనల్ని గెలిపిస్తుంది

Select Suryaa Now
భివృద్ధే మనల్ని గెలిపిస్తుంది

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :  నెల్లూరులో గత రెండేళ్లలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూటమి అభ్యర్థుల భారీ విజయాన్ని ఖాయం చేస్తాయని టీడీపీ మేయర్ అభ్యర్థి పి. రూప్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని డి.ఎస్.ఆర్  పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును  వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, స్థానిక నాయకుల సమష్టి కృషితో నగరం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధికి పట్టం కట్టేందుకు ప్రజలందరూ తమ ఓటును టీడీపీకే వేస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన ఆయన, ఈఎన్నికల్లో ప్రజలు ఇస్తున్న ఈ తీర్పుతో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతు కావడం నూటికి నూరుపాళ్లు ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  54 డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి అన్నంగి సమత ఉన్నారు.