BREAKING
రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌ రైతులను అతలాకుతులం చేసిన తుఫాన్ విజన్ ఆఫ్ రామాయణ స్పెషల్ వీడియో విడుదల.. మైండ్ బ్లాకింగ్ మేకింగ్ విజువల్స్‌తో రణ్ బీర్, సాయిపల్లవిల హంగామా బ్రెజిల్‌లో తీవ్ర రాజకీయ దుమారం చిన్న పిల్లల వైద్యుడు డా. హరి మృతి రాష్ట్రం బాగుండడమే కూటమి లక్ష్యం : ఎమ్మెల్యే విజయచంద్ర వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాల్ నాయుడు . ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అద్భుత ప్రతిభ

భీమవరంలో ఘనంగా జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్'

Select Suryaa Now
భీమవరంలో ఘనంగా జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్'

 భీమవరం, సూర్య న్యూస్:ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA), ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ (APLTA) ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా ప్రతిష్టాత్మక 'సిఫీ ఐటా పురుషులు & మహిళల జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్' అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు నిర్వహించనున్నట్లు క్లబ్ మరియు టోర్నమెంట్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. కాస్మో స్పోర్ట్స్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో జరిగే ఈ పోటీలకు సంబంధించిన వివరాలను మంగళవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు.

ఈ పోటీలకు సిఫీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  రాజు వేగేశ్న ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా, ఆనంద గ్రూప్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ మరియు కాస్మోపాలిటన్ క్లబ్ సభ్యులు కో-స్పాన్సర్లుగా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం రూ. 5,00,000 నగదు బహుమతితో పాటు క్రీడాకారులకు వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

పోటీల షెడ్యూల్ & వేదికలు:

అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు జరగనుండగా, నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు మెయిన్ డ్రా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ కల్చరల్ అసోసియేషన్, ఎల్.హెచ్. భీమవరం టౌన్ హాల్, బీవీ రాజు కళాశాలల్లోని టెన్నిస్ కోర్టులలో ఈ పోటీలు ఏకకాలంలో జరుగుతాయి. మెయిన్ డ్రాలో పురుషులు, మహిళల విభాగాల్లో డైరెక్ట్ ఎంట్రీస్ ద్వారా 24 మంది, క్వాలిఫైయింగ్ రౌండ్ ద్వారా 8 మంది చొప్పున మొత్తం 32 మంది చొప్పున బరిలోకి దిగుతారు.

నవంబర్ 2న టోర్నమెంట్ ప్రారంభోత్సవం:

నవంబర్ 2వ తేదీ (సోమవారం) సాయంత్రం 5:00 గంటలకు నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒడిశా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్ర (IAS రిటైర్డ్), పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్  సి. నాగరాణి (IAS) ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారని, వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు క్రీడా వేదికలకు చేరుకోవడానికి ఉచిత రవాణా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు & టోర్నమెంట్ కమిటీ ఛైర్మన్ సిహెచ్. రామభద్ర రాజు, టోర్నమెంట్ కమిటీ ఛైర్మన్ యు. కృష్ణ ప్రసాద్, వైస్ ఛైర్మన్ టి. కృష్ణ బాబు, క్లబ్ కార్యదర్శి & కో-ఆర్డినేటర్ భుపతిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షులు వి. రమేష్, టోర్నమెంట్ కార్యదర్శి యు.ఆర్.పి.ఆర్. వర్మ తదితరులు ఉన్నారు.