BREAKING
ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని కలిసిన నూతన సీడీపీవో సిహెచ్. శ్రీదేవి స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ..అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలపై దృష్టి.. పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీలే కీలకం పల్లెపండుగకు భారీగా తరలిన కూటమి శ్రేణులు: అపారిశుధ్యం నిర్మూళించే బాధ్యత గ్రామ కార్యదర్శులదే అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచుతాం కనిగిరి నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పోలిపల్లి ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం ఉత్తేజ భరతముగాపోషకాహార ఉత్సవాలు సిడిపిఓ ఎల్ సుజాత. ఉద్యాన రంగంలో వినూత్న ఆలోచనలకు వేదిక హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌లో విద్యార్థుల సృజనాత్మకత

భీమవరం మీడియా క్లబ్ అభివృద్ధికి సహకరిస్తా: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

Select Suryaa Now
భీమవరం మీడియా క్లబ్ అభివృద్ధికి సహకరిస్తా: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

భీమవరం, మేజర్ న్యూస్: నూతనంగా ఏర్పాటైన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియా క్లబ్ కార్యకలాపాలు, జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలు, వారి ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

మీడియా క్లబ్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ప్రతినిధులు డిప్యూటీ స్పీకర్‌కు వివరించారు. భీమవరంలో జర్నలిస్టుల కోసం క్లబ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భీమవరం మీడియా క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం అన్ని విధాలుగా అందిస్తానని తెలిపారు. అనంతరం క్లబ్ సభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజును సాలువ కప్పి, పుష్పగుచ్చమిచ్చి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఆరేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీఎన్‌ఎల్ మూర్తి, ఉపాధ్యక్షులు సూర్య, కోశాధికారి కేతా సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు గేదెల శ్రీనివాస్, గౌరవ సలహాదారు వశిష్ట టుడే తాతారావు, మహా న్యూస్ రంగబాబు, టీవీ5 బ్రహ్మాజీ, ఏబీఎన్ వర్మ, హెచ్ఎంటీవీ అరుణ్, ఆర్ టి వి కృష్ణ, బి ఆర్ కే హనుమంతరావు, మెగా 9 వెంకట్, విశాలాంధ్ర చిన్నబాబు, తరుణ్, ఆర్ కె  తదితరులు పాల్గొన్నారు.

 శ్రీనివాస్ భీమవరం