భీమన్నకు ఘన సన్మానం
శ్రీపద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భీమన్నను ఏపీ బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పర్చూరు నారాయణ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ గౌడ్ పుష్పగుచ్చం, అందజేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ భీమన్నకు విద్యారంగంలో విశేష అనుభవం, సేవాభావం ఉన్నాయని, ఆయన నాయకత్వంలో కళాశాల మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు అవసరమైన మార్గదర్శకత్వంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.కళాశాల అభివృద్ధిలో అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. నూతన ప్రిన్సిపాల్‌కు పలువురు విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ విద్యార్థి విభాగం సభ్యులు మణికంఠ, లోకేష్ రెడ్డి, హరికృష్ణ ఉన్నారు.