BREAKING
నృత్య కళాకారిణి విష్ణు ప్రియకు మేము సైతం మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక పోచారం డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు: మందడి సురేందర్ రెడ్డి కూటమినేతలంతా కలిసికట్టుగా ఉన్నాం... అపోహలు నమ్మద్దు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: మాజీ మంత్రి హరీశ్ రావు దసరా పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి విజయదశమి, దసరా సందర్భంగా సిద్దిపేట ప్రజలకు పూజల హరికృష్ణ శుభాకాంక్షలు రాజకీయ పార్టీల నాయకుల తో సమావేశం నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులకు మద్దతివ్వాలి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ పాలపిట్టను కాపాడుకుందాం.. ప్రకృతిని సంరక్షిద్దాం:జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) విశాల్ బత్తుల, ఐఎఫ్‌ఎస్‌ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సమక్షంలో 25 మంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరిక.. అప్పాజీపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు దుర్గామాత విగ్రహాన్ని అందజేసిన ధనరాజ్ ముదిరాజ్ చల్లూరులో దుర్గామాతకు విప్ బీర్ల ప్రత్యేక పూజలు

భక్తులు పాలిట కొంగుబంగారమైన నిలిచిన రామగిరి గంగమ్మ

Select Suryaa Now
భక్తులు పాలిట కొంగుబంగారమైన నిలిచిన రామగిరి గంగమ్మ

 సూర్య రామగిరి ప్రతినిధి : భక్తులు పాలిట కొంగుబంగారమైన నిలిచింది రామగిరి గంగమ్మ. రామగిరి మండలంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా మండలంలోని గంగపుత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిభావాన్ని చాటుకున్నారు.మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణలు, ప్రత్యేక పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామగిరి మండల కేంద్రంలో కొలువై ఉన్న శరన్నవరాత్రుల వేడుకల్లో  భాగంగా గంగపుత్రులు ఘనంగా ఏర్పాట్లు చేసి, గంగమ్మ తల్లికి విశేష పూజలు, అభిషేకాలు మరియు అర్చనలు నిర్వహించారు.

 దేవి శరన్నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరించి ప్రతి అవతారాన్ని అలంకరించారు. అమ్మవారి సన్నిధిలో అన్నదానం నిర్వహించడం వంటి ముహూర్తర కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ శ్రేయస్సును కోరుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని,మత్స్యకారులు మరియు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలలో గంగపుత్రులు సంఘం పెద్దలు, స్థానిక యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నవరాత్రుల తొమ్మిదవ రోజున నిర్వహించిన ఈ వేడుకలతో రామగిరి ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

​మధుసూదన్ గౌడ్ రామగిరి