BREAKING
పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక మంత్రి తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు-కాసాని పద్మ శేఖర్ కేంద్రాల్లోకి రావొద్దంటూ వాగ్వాదం.. ఎంపీడీవో చెప్పినా వినిపించుకోని ఎస్సై భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర శ్రీవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సోమవారం పీజీఆర్ఎస్ రద్దు : గుంటూరు జిల్లా కలెక్టర్

భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

Select Suryaa Now
భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబర్ 15, మేజర్ న్యూస్: 

కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీముఖలింగం, ఉమా రుద్రకోటేశ్వర ఆలయం, టెక్కలిలోని శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాలతో పాటు అన్ని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. స్వామివారి దర్శనం సులభతరంగా, త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రద్దీ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

 

రిపోర్టర్

గంట అప్పన్న