భైరవకోనలో మహావరుణ యాగం(
సిఎస్ పురం,మేజర్ న్యూస్: రాష్ట్రప్రజలు సుఖసంతోషాలతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రశాంతంగా ఉండాలని ప్రభుత్వం దేవాదాయశాఖ ఆదేశాల మేరకు మంగళవారం ప్రసిద్ధ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలో భైరవేశ్వర దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,ఇఓ డి.వంశీకృష్ణారెడ్డి అధ్వర్యంలో మహావరుణ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకుల బృందం ముందుగా శ్రీత్రిముఖ దుర్గభర్గులేశ్వరస్వామి కాలభైరవేశ్వరస్వామి నగరేశ్వరస్వామి ఇతర శివలింగాలకు పంచామృత అభిషేకం పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమార్చన పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేకంగా అలంకరణ చేసిన హోమమండపం నందు అర్చకులు వరుణ యాగం విశేష హోమపూజలు నిర్వహించి అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈకార్యక్రమంలో దేవస్థానం ఇఓ డి.వంశీకృష్ణారెడ్డి,అర్చకులు వెంకటనరసయ్య,రామ్మూర్తిశర్మ, సుధాకరశర్మ,పలువురు వేదపండితులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు,పర్యాటకులు పాల్గొన్నారు.