బీసీలకు అవకాశం వచ్చింది..... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా
ముత్తుకూరు, అక్టోబర్ 16( మేజర్ న్యూస్) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణపట్నం సర్పంచ్ స్థానం బీసీలకు కేటాయించిన సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని ఆ గ్రామానికి చెందిన మత్స్యకార సంఘం నాయకులు బి పోలయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. మత్స్యకార గ్రామాల్లో బీసీ ఓటు బ్యాంకు బలమైన శక్తిగా ఉందన్నారు. సర్పంచ్ స్థానంతో పాటు కొన్ని వార్డులకు పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.