బైండోవర్ నెపంతో నిర్బంధించడం తగదు
- నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పేరడా తిలక్
సంతబొమ్మాలి,అక్టోబర్ 30,మేజర్ న్యూస్ :
బైండోవర్ కేసులు నెపంతో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నిర్బంధించడం తగదని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. శుక్రవారం సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్కు వెళ్లి వైఎస్ఆర్సిపి నాయకులను పరామర్శించి అనంతరం మాట్లాడారు. సంతబొమ్మాలి-2 వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి మల్ల నిర్మల భర్త రాజు,మాజీ ఎంపీటీసీ కొన్న శ్రీరాములు, చిన్నతుంగాం ఎంపీటీసీ అభ్యర్థి కాని. జగ్గారావులను బైండోవర్ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నిర్బంధించడం వల్ల వారు ఎన్నికల ప్రచారానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇలాంటి కుయుక్తులకు పాల్పడటం సరికాదని, ప్రజలంతా ఈ పరిణామాలను గమనిస్తున్నారని అన్నారు. ఓటర్లు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకుల ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడానికే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పేరాడ తిలక్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.