BREAKING
స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం రామాయణం సినిమాపై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం: బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు * నిర్మాతల కష్టాలు చూడండి: అమితాబ్, షారుఖ్, సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ నిర్మాత కేసీ బోకాడియా జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పెద్దమోదుగపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ స్టంట్‌ఉమెన్ గీతా టాండన్‌కు చేదు అనుభవం: అనిల్ కపూర్, ఫరా ఖాన్ క్షమాపణలు ఆనందపురం సీఐ మానవత్వానికి నిదర్శనం.. వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీస్ అధికారి! సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన గుండెపోటుతో వ్యక్తి మృతి జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేదిక్ రామేశ్వర్ ఠాకూర్ స్మృతి సంకలనం నూతన వధువు ఓటు హక్కు వినియోగం - చిత్తూరు మండలంలో ఆదర్శంగా నిలిచిన రమ్య విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి

బాణసంచా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సీఐ వాసునాయుడు

Select Suryaa Now
బాణసంచా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సీఐ వాసునాయుడు

​గాజువాక, సూర్య : దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గాజువాక సీఐ చింతా వాసునాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. వ్యాపారులు జీఎస్టీతో పాటు విద్యుత్, అగ్నిమాపక, జీవీఎంసీ విభాగాల నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా పొందాలని, కేవలం ‘గ్రీన్ క్రాకర్స్’ మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేసి తగిన అగ్నిమాపక జాగ్రత్తలు పాటించాలని, 18 ఏళ్లలోపు వారికి టపాసులు అమ్మకూడదని ఆదేశించారు. పండుగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి ఉందని, బహిరంగ ప్రదర్శనలకు వారం రోజుల ముందే అనుమతి తీసుకోవాలని సూచించారు. గాజువాక పరిసరాల్లో ఎవరైనా అనధికారికంగా బాణసంచా నిల్వ చేసినట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112 లేదా గాజువాక సీఐ ఫోన్ నంబరు 9440796014కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.