అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా – నిడుమోలు బోసుబాబు మైనేనివారిపాలెంలో ఇరుముడి కార్యక్రమంలో హాజరైన ప్రజ్వల ప్రాపర్టీస్ అధినేత నిడుమోలు బోసు బాబు
రేపల్లె మేజర్ న్యూస్; మైనేనివారిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి ప్రజ్వల ప్రాపర్టీస్ అధినేత నిడుమోలు బోసుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బోసుబాబు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష అనేది భక్తి, క్రమశిక్షణ, నియమ నిష్ఠలకు ప్రతీక అని అన్నారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రతి ఒక్కరితో సోదరభావంతో మెలుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు.నల్లూరు నార్త్ పంచాయితీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులు కోరుకుంటున్నానని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.