BREAKING
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు! అమెరికాలో ఉబెర్ డేటా బ్రీచ్ కలకలం ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంపై శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం!

అశోక్ రెడ్డి అభివృద్ధికి జైకొట్టిన 70 కుటుంబాలు.. వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక

Select Suryaa Now
అశోక్ రెడ్డి అభివృద్ధికి జైకొట్టిన 70 కుటుంబాలు.. వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌:

 కంభం మండలం పెద్ద నల్లకాలువ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన బొట్టా రంగస్వామి, కాకర్ల సురేష్, చప్పిడి బుజ్జి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీకి చెందిన 50 కుటుంబాలు , నర్సిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు దాదాపు గా 70 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీలో చేరిన వారికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంభం మండల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.