ఆర్ట్ ఆఫ్ లివింగ్ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్‌లోపాల్గొన్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి,–మేజర్ న్యూస్:చింతలపూడి పట్టణంలోని లైన్స్ క్లబ్‌లో నిర్వహిస్తున్న ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ శిక్షణ తరగతుల్లో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ధ్యానం, ఆధ్యాత్మిక సాధన, మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవన విధానం తదితర అంశాలపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. ధ్యానం, ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల ఆలోచనా విధానం పెంపొందుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ప్రజలలో ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రిపోర్టర్ ఖలీల్ చింతలపూడి ఏలూరు జిల్లా,