అర్బన్ అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి ఐ.సి. డి. యెస్.ప్రాజెక్టు పరిధిలో గల అర్బన్ అంగన్వాడీ కార్యకర్తలకు ఈ 9 వి తేదీ నుంచి 13 వరకు రెండు రోజులు పోషన్ బి. పడాయి బి.సెకండ్ రౌండ్ శిక్షణ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలకు గొల్లపల్లి హైస్కూల్లో జరుగుచున్నది. ఈ శిక్షణ కార్యక్రమంలో మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆధార్ శీలా. సిలబస్ ద్వారా ప్రతిరోజు స్టేట్ నుండి వస్తున్నా ఆర్. ఎల్.ఎం.వీడియోలులో ఉన్న సిలబస్. కార్యక్రమాలను పిల్లలకు వినిపించడం జరిగింది. తల్లుల గ్రూపుల్లో పంపించడం అనే విషయాల గురించి పుట్టి నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ప్రతి నెలలో జరుగు అభివృద్ధిలు అంగన్వాడీ కార్యకర్తల యాప్ లో స్క్రీనింగ్ చేయడం ఏ నెలలో జరగవలసిన పిల్లలు అభివృద్ధిలు ఆ నెలలో జరుగుతున్నది. అలాగే పిల్లలకు స్క్రీనింగ్ చేసి గృహసందర్శన ద్వారా తల్లులకు తెలియ పరచడం జరిగింది. పిల్లలు అభివృద్ధి విషయాల గుర్తించి పిల్లలను హాస్పిటల్ కు రిఫర్ చేయటం ఈరోజు శిక్షణ అంశాలు. ఈ శిక్షణా కార్యక్రమం సెక్టార్ సూపర్వైజర్స్ రమాదేవి. రాజు ప్రభావతి సుబ్బలక్ష్మి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.