BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

అనంతపురం రూరల్ లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ విడుదల

Select Suryaa Now
అనంతపురం రూరల్ లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల  షెడ్యూల్ విడుదల

 

అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్  సోమవారం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో అనంతపురం రూరల్ మండలంలో ఎన్నికల సమరం మొదలైంది.  మండలంలో 36 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పిటిసి స్థానానికి 
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో  ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్  నారాయణస్వామి, ఏ ఆర్ ఓ పి. దివాకర్ ఎన్నికల షెడ్యూల్ ను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.     అనంతపురం రూరల్ మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రంలో ఈనెల 21 నుంచి 23 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5  గంటల వరకు రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు నారాయణస్వామి తెలిపారు.  24న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలన,  25న  తిరస్కరించిన నామినేషన్ల పై అప్పిలు 26న అప్పిలేట్ అధికారి అప్పీలు పరిష్కారం, 27న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ,  మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్థులను తుది జాబితా ప్రచురిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.  నవంబర్ 3 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అన్ని గ్రామ పంచాయతీల ఎంపిటిసి స్థానాలకు, జడ్పిటిసి స్థానానికి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మండలంలో ఎక్కడైనా పోలింగ్ లో ఇబ్బందుల ఎదురైతే నవంబర్ 4 న రీపోలింగ్ జరుగుతుందని తెలిపారు. 5 న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ లోని ప్రధాన భవనంలో  ఎన్నికల కౌంటింగ్ , ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నారాయణస్వామి తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా  అనంతపురం రూరల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు, 8 సీసీ కెమెరాలతో  కెమెరాలతో ప్రత్యేక నిఘ పెట్టినట్లు ఎన్నికల అధికారి నారాయణస్వామి తెలిపారు.  నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులకు అవసరమైన ఫారాలు, సర్టిఫికెట్లు సలహాలు అందించేందుకు కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు  ఆయన తెలిపారు. మండలంలో ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ అధికారులతో కలసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నారాయణస్వామి తెలిపారు.