అనంతపురం కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన డీఆర్ఓ మలోల
అనంతపురం బ్యూరో : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఏ. మలోల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాట నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతిపితకు నివాళులర్పించారు.