BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా ఉత్సవం కార్యక్రమం

Select Suryaa Now
అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా ఉత్సవం కార్యక్రమం

ఆత్మకూరు, మేజర్ న్యూస్:  ఆత్మకూరు పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా పండుగ వాతావరణం లో నిర్వహించారు.ఐసిడిఎస్ జిల్లా పిడి నాగ శైలజ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ ఆత్మకూరు ప్రాజెక్టు సిడిపిఓ పి.సునీలత పర్యవేక్షణలో స్థానిక అరుంధతియవాడ, బీసీ కాలనీ, వెస్ట్ హరిజనవాడ అంగన్వాడీ కేంద్రాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు టి. సునీత, డి. పద్మావతి, జి. సుప్రజ లు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా అలంకరించి ఆ పరిధిలోని ముఖ్యలను ఆహ్వానించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను అందరికీ వివరించి తగిన అవగాహన కల్పించారు. పౌష్టికాహారం ఆవశ్యకత తద్వారా లభించే ఆరోగ్యం గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య లభిస్తుందని తద్వారా వారు పాఠశాలలో చేరినప్పుడు తర్ఫీదు పొందిన విద్యార్థులు లాగా ఉండగలరని వారు పేర్కొన్నారు. అంగన్వాడి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి తగిన పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య పొందేలా చూడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు టి.సునీత, డి. పద్మావతి,జి.సుప్రజ, పలువురు గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.