అమెరికాలోనూ లేని సింగిల్ పవర్ గ్రిడ్ మనదేశంలోనే సాధ్యమైంది: సీఎం చంద్రబాబు
అమరావతి, సూర్య ప్రతినిధి :దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వం వల్లనే కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రభుత్వాధినేతగా (గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా) మోడీ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు.
2015లో సోలార్ పవర్‌ను తక్కువ ధరకే అందించడంపై ప్రధానంగా దృష్టి సారించామని, ఫలితంగా నేడు దేశంలో తక్కువ ధరకే సౌర విద్యుత్ లభ్యమవుతోందని సీఎం గుర్తుచేశారు. ప్రధాని మోడీ ప్రోత్సాహంతోనే దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగం ఊపందుకుందన్నారు. మనదేశంలో 'వన్ నేషన్ - వన్ పవర్ గ్రిడ్' విజయవంతంగా అమలవుతోందని, ఆధునిక అమెరికాలో కూడా నేటికీ సింగిల్ పవర్ గ్రిడ్ వ్యవస్థ లేకపోవడం గమనార్హమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.