BREAKING
ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష

అచ్యుతాపురంలో పవర్‌ బూస్ట్‌

Select Suryaa Now
అచ్యుతాపురంలో పవర్‌ బూస్ట్‌

 రూ.77.29 కోట్లతో 220 కేవీ గ్యాస్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

-పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్‌ మౌలిక వసతుల విస్తరణ

-పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరానే ప్రభుత్వ లక్ష్యం

-బలమైన విద్యుత్‌ వ్యవస్థతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

-లైన్‌మెన్‌ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబుతో చర్చ.. త్వరలో నిర్ణయం

-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

ఏపీ స్టేట్‌ బ్యూరో, అమరావతి:

అనకాపల్లి జిల్లాలో పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో భారీ ఊతమిచ్చింది. పెరుగుతున్న పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా రూ.77.29 కోట్ల వ్యయంతో ఏపీ ట్రాన్స్‌కో నిర్మించిన 220 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అచ్యుతాపురం ప్రాంతంలో విద్యుత్‌ డిమాండ్‌ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్‌తో వినియోగదారులకు మరింత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి తరలిరావాలంటే పటిష్టమైన విద్యుత్‌ వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నారు.

పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్‌ శాఖ సుమారు రూ.1,816 కోట్ల మేర వ్యయం చేస్తోందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు అచ్యుతాపురం ప్రాంతంలో మరో మూడు సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అచ్యుతాపురం 220 కేవీ సబ్‌స్టేషన్‌కు శ్రీకారం చుట్టిందని మంత్రి గుర్తుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిధులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వం పలు సబ్‌స్టేషన్ల పనులను అర్థాంతరంగా నిలిపివేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో విద్యుత్‌ రంగ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

పెట్టుబడులకు పవర్‌ బ్యాక్‌బోన్‌

రాష్ట్రంలో పటిష్టమైన విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యుత్‌ మౌలిక వసతుల బలోపేతం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

లైన్‌మెన్‌ పోస్టుల భర్తీపై త్వరలో నిర్ణయం

విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌ల కొరత క్షేత్రస్థాయి పర్యటనల్లో తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఏఈ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసి 629 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించిన అనంతరం త్వరలో నిర్ణయం తీసుకుంటామని గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడించారు.