ఆటో ఢీకొని ద్విచక్ర వాహన దారుడు మృతి..
సాలూరు, సూర్య : ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని ఆటో ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి సాలూరు మండలం చిన్న ఊటగెడ్డ గ్రామానికి చెందిన అరసాడ తిరుపతిరావు (41) మామిడిపల్లి నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. తిరుపతిరావు భార్య జయంతి కురుకూటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు. పందిరిమామిడివలస గ్రామ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఆటో, తిరుపతిరావు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతిరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త ప్రమాద వార్త తెలియడంతో భార్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తిరుపతిరావు దంపతులకు సంతానం లేదు.పెళ్లి జరిగి మూడు సంవత్సరాలయింది. సమాచారం అందుకున్న సాలూరు రూరల్ ఎస్సై రవీంద్రరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నారు.