ఆర్మీ జవాన్ ఘన సన్మానం
సంతబొమ్మాలి సూర్య: భారత సైన్యంలో 24 సంవత్సరాల పాటు దేశానికి సేవ అందించి రిటైర్మెంట్ అనంతరం సొంత గ్రామం కాపుగోదాయవలస విచ్చేసిన జవాన్ వాడరేవు రాజుకి (హవల్దార్) ఘనంగా బుధవారం సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆయనను శాలువాతో సత్కరించి, గౌరవ సన్మాన పత్రం అందజేశారు. పాఠశాల విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా జవాన్ రాజుకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ అంగ లక్ష్మి జనార్ధన్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.