ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా పెద్దబొడ్డేపల్లి శివారులో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు –
యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడవద్దు.. జీవితం నాశనం చేసుకోవద్దు సీఐ ఎస్.కె గఫూర్ యువతకు పిలుపు
నర్సీపట్నం అక్టోబర్ 13 మేజర్ న్యూస్ :
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె గఫూర్ , అనకాపల్లి ఈగల్ టీమ్ ఇన్‌చార్జి ఆర్‌ఐ నారాయణరావు , హెడ్ కానిస్టేబుల్ రామ్‌కోటి మరియు సిబ్బందితో కలిసి పెద్దబొడ్డేపల్లి గ్రామ శివారు ప్రాంతంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సి ఐ ఎస్ కె గపూర్ మాట్లాడుతూ సుమారు 50 మంది వ్యక్తులకు డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా, ఎవరికీ పాజిటివ్ ఫలితాలు నమోదు కాలేదు.
అని తెలిపారు. యువతకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారూ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత కార్యకలాపాల నియంత్రణకు పోలీసు శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే పోలీసులకు తెలియజేసి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.