BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి కేంద్రం పెద్దపీట బిజెపి నేత గాలి హరిప్రసాద్

Select Suryaa Now
ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి కేంద్రం పెద్దపీట బిజెపి నేత గాలి హరిప్రసాద్

వేంపల్లె మేజర్ న్యూస్:
భారత దేశంలోని ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలు, చారిత్రక వారసత్వ ప్రాంతాలను ఆధునిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ రంగానికి పెద్దపీట వేస్తోందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని విశేష ప్రాధాన్యత కల్పిస్తూ ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 2014-15లో ప్రారంభమైన ఆ పథకం ద్వారా మెరుగైన సౌకర్యాలు, పరిశుభ్రత, బధ్రత, రహదారి, చివరి మైలు కనెక్టివిటీ, పార్కింగ్, తాగునీరు, సమాచార కేంద్రాలు, నిఘా కెమెరాలు తదితర మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆ పథకం కింద 54 ప్రాజెక్టులకు రూ. 1726 కోట్లు ఆమోదం లభించిందన్నారు. రాష్ట్రంలోని అమరావతి, శ్రీశైలం, సింహాచలం ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టగా.. అన్నవరం ఆలయ పట్టణంలో యాత్రికుల సౌకర్యాల అభివృద్ధికీ రూ. 25.33 కోట్లు మంజురైనట్లు వెల్లడించారు. ఆధ్యాత్మిక సంపదను ఆధునిక పర్యాటక మౌలిక వసతులతో అనుసంధానం చేయడం ద్వారా వారసత్వ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, స్థానిక ఉపాధి మెరుగు పరిచేందుకు దోహద పడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పుష్పలత, రంగారెడ్డి, శివకృష్ణ, సురేష్, దశరథ తదితరులు పాల్గొన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.