9వ డివిజన్ అభివృద్దే ప్రధాన లక్ష్యం
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగరం లోని స్థానిక 9వ డివిజన్ పరిధి కి చెందిన కొండారెడ్డిపల్లి కరుమారియమ్మ గుడి వీధి, ఎస్బిఐ కాలనీ, మురుగాని పల్లి ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్య మని 9వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అగ్రహారం వెంకటేష్ తెలిపారు. ఆదివారం స్థానిక కొంగారెడ్డి పల్లి లోని స్వర్ణ సచివాలయంలో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను రాజకీయాల లోకి రావడం జరిగిందని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి జరుగుతోందని, 9వ డివిజన్ అభివృద్ధి చేయడంలో భాగంగా తాను జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. స్థానిక ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు.