BREAKING
ప్రజాధనంలో ప్రతి రూపాయికి లెక్క ఉండాలి.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటన డాక్టర్ డూమ్ హవా.. అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి ఐదు కొత్త పోస్టర్లు విడుదల! రైతు అభివృద్ధి,సంక్షేమానికి ఏఎంసి లు  పాటుపడాలి. నెల్లూరు కార్పొరేషన్‌లో స్వతంత్రుల సత్తా.. రెండు డివిజన్లలో విజయకేతనం! అయ్యవారిపల్లి భూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం..పీయూష్ గోయల్ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల జోరు నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మేయర్ కొలగాని శ్రీనివాస్ దక్షిణ కొరియాతో ముగిసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి నౌకాదళ విన్యాసాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు–2026: పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి. యువ ఆపద మిత్ర శిక్షణలో శాతవాహన కామర్స్ వాలంటీర్లు పశ్చిమ బెంగాల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పోశమ్మ తల్లికి బోనం.. ఉద్యోగ భద్రత కోసం వేడుకోలు -22వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె. - ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు

61వ డివిజన్‌లో ఆనం రంగమయూర్ రెడ్డి విజయదుందుభి!

Select Suryaa Now
61వ డివిజన్‌లో ఆనం రంగమయూర్ రెడ్డి విజయదుందుభి!

నెల్లూరు, అర్బన్, క్రైమ్,  మేజర్ న్యూస్ :    నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 61వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి తనయుడు ఆనం రంగమయూర్ రెడ్డి అఖండ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 2,350 ఓట్ల భారీ మెజార్టీతో విజయం కైవసం చేసుకుని 61వ డివిజన్‌లో టీడీపీ జెండాను రెపరెపలాడించారు. ఈ ఘనవిజయంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.దివంగత ఆనం వివేకానంద రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నికల బరిలో నిలిచిన ఆనం రంగమయూర్ రెడ్డికి ఓటర్లు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. ఎన్నికల సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ అందించిన సహకారం, ప్రోత్సాహం తన విజయానికి తోడ్పడ్డాయని రంగమయూర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన ఇరువురు మంత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 2,350 ఓట్ల భారీ మెజార్టీతో లభించిన విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.61వ డివిజన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, డివిజన్ అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆనం రంగమయూర్ రెడ్డి స్పష్టం చేశారు. దివంగత ఆనం వివేకానంద రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననే ఆకాంక్షను వ్యక్తం చేశారు.