35 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
సీతానగరం: 1990-91 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల 35 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక ఆదివారం ఉత్సాహంగా, సందడిగా జరిగింది. మండలంలో కోట సీతారాంపురం గ్రామం సమీపంలో ఉన్న ‘సువర్ణముఖి సన్‌రైజర్స్’ రీస్టార్ట్ లో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో అప్పటి ఉపాధ్యాయులు కోన సత్యం మాస్టారు, శ్రీరామమూర్తి మాస్టారు, అప్పలస్వామి మాస్టారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 35 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో ఆనందాన్ని పంచుకున్నారు. పాత స్నేహితులంతా కలిసి ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, నాటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ సందడి చేశారు.
అరవింద్ పట్నాయక్, ఆర్.వి. కిషోర్, వడిగళ్ల ప్రసాద్, గునుపూరు ప్రసాద్, మర్రపు రామినాయుడు తదితర పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.