BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

34% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Select Suryaa Now
34% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

అమరావతి, సూర్య ప్రతినిధి :స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కాకుండా, అసలు ఏ స్థానం ఏ వర్గానికి కేటాయించారో స్పష్టత లేకుండానే వైసీపీ నెల్లూరు మేయర్ అభ్యర్థిని ఏ ప్రాతిపదికన ప్రకటించిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే నిజమైన వెన్నెముక అని పేర్కొన్న మంత్రి, రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఫలితం రేపు వెలువడే అవకాశం ఉందన్నారు.

సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సూచనలు ఇచ్చారు.