30 సంవత్సరాలుగా... సైకిల్ ప్రయాణం.
30 సంవత్సరాలుగా... సైకిల్ ప్రయాణం.
జీవితమంతా తెలుగుదేశం పార్టీకి అంకితం.
ఒత్తిళ్లు వచ్చినా సైకిల్ పై పోరాటం.
టిడిపి ప్రభుత్వంలో కోటి పది లక్షలతో అభివృద్ధి పనులు.
పార్టీ పిఠాయింపు లేకుండా ప్రజల వైపు.
సర్పంచ్ అభ్యర్థిగా వాంకిల శీనయ్య తనయురాలు డాక్టర్ గౌరీ ప్రియ.
ముత్తుకూరు, నవంబర్ 27( మేజర్ న్యూస్) పైనం పురం గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన పార్టీ సేవకులు ఉన్నారు. సుదీర్ఘకాలంగా పసుపు జెండా మోస్తూ సైకిల్ పై ప్రయాణం చేస్తున్నారు. ప్రలోభాలు, రాజకీయ బెదిరింపులు, ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక సమస్యలు ఉన్నా కూడా తొలి పార్టీ సభ్యత్వమే మరణం దాకా ఉండాలన్న ఆశయంతో తెలుగుదేశం పార్టీలో రాణిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సైకిల్ ని శ్వాసగా భావిస్తున్నారు. అలాంటి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. పైనం పురం గ్రామానికిచెందిన బీసీ సామాజిక వర్గం వాంకిల శీనయ్య. తెలుగుదేశం పార్టీ అంటేనే తన శ్వాసగా భావించే వ్యక్తి. 30 సంవత్సరాల గా ఈ పార్టీలో పనిచేస్తున్నారు. యుక్త వయసు నుంచే టిడిపిలో ప్రవేశం పొందారు. మొట్టమొదట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నందు స్కౌట్ బాయ్ గా దేశ రక్షణకు నిలిచారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు పరిచయాలు ఏర్పడి అనుచరుడుగా ముద్ర వేసుకున్నారు. ముసునూరు వారి పాలెం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి కుటుంబానికి నమ్మిన బంటు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు వార్డు సభ్యుడిగా గెలిచి గ్రామానికి సేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ఉన్నప్పుడు పైనంపురం గ్రామంలో సమర్థవంతమైన కార్యకర్తగా టిడిపిలో పనిచేశారు. రాష్ట్రమంతా వైయస్ ప్రభంజనం వీస్తుండగా పంచాయతీ ఎన్నికల్లో ఎదురొడ్డి నిలిచారు. తన సతీమణి వాంకిల హైమావతిని సర్పంచ్ స్థానానికి పోటీ చేయించి ఉత్కంఠ మధ్య 485 ఓట్లు సాధించారు. కొన్ని వార్డులు కైవసం చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరకు ఆహ్వానాలు అందిన తెలుగుదేశం జెండా విడవలేదు. మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా పనిచేసి బీసీ సామాజిక వర్గాన్ని పార్టీలో బలోపేతం చేశారు. ప్రస్తుతం పైనం పురం సాగునీటి సంఘం డైరెక్టర్ గా రైతులకు వ్యవసాయరంగంపై పనిచేస్తున్నారు. టిడిపి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పని చేసినప్పుడు గ్రామ అభివృద్ధిలో బీసీ నాయకులు వాంకిలశీనయ్య కీలక పాత్ర పోషించి ఉన్నారు. బీసీ , ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సుమారు కోటి పది లక్షల రూపాయలతో మూడు కిలోమీటర్ల 70 మీటర్ల వరకు సీసీ రోడ్లు నిర్మాణం చేయించారు. ఇప్పటికీ 40 లక్షల రూపాయలు బిల్లులు నిలిచి ఉన్నాయి. ఆర్థికంగా నష్ట పోయినా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. గ్రామంలో అన్ని వర్గాల నుండి వివాద రహితడిగా పేరు గడించారు.
......................................................
పైనంపురం సర్పంచ్ అభ్యర్థిగా.... డాక్టర్ వాంకిల గౌరీ ప్రియ.
.........................................................
రెండవ సాధారణ గ్రామపంచాయతీ-2026 ఎన్నికల్లో తన కుమార్తె డాక్టర్ గౌరీ ప్రియ ను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దింపారు. తెలుగుదేశం పార్టీ అండదండలు, గ్రామస్తులతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో మద్దతు కూడగట్టుకుని ప్రచారాన్ని సాగిస్తున్నారు. పార్టీ మారలేదు.. సిద్ధాంతం ఒకటే .. సుదీర్ఘకాలంగా పార్టీకి పని చేశాను.. ఆశీర్వదించండి అంటూ అజెండాతో చేస్తున్న ప్రచారానికి విశేషంగా స్పందన లభిస్తుంది. ఓటర్ల సైతం జై కొడుతున్నారు. అత్యధిక భాగం ఎస్సీ సామాజిక వర్గం ఆయన కుటుంబానికి అండగా నిలిచి ఎన్నికల్లో సహకారం అందిస్తున్నారు. సర్పంచ్ గా తమ కుమార్తెకు అవకాశం కల్పిస్తే పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామన్న స్పష్టమైన సంకేతాన్ని ఓటర్లకు అందిస్తున్నారు. అందరిని చూశాం వాంకిలకు అవకాశం కల్పిస్తాం అనే విధంగా ఓటర్లు ఆలోచన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.