29వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,పట్టణంలోని 29వ వార్డులో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, నంబూరు రామచంద్రరాజు, బొబ్బర రాజ్‌కుమార్, పిసుపాటి రామలక్ష్మి, కోనేటి చంటి, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, మాలికల నాగేశ్వరరావు, షేక్ యాకోబ్, కర్ణం రాంబాబు, శీలం గోపి తదితరులు పాల్గొన్నారు.
కే వి రమణారావు జంగారెడ్డిగూడెం