BREAKING
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు! అమెరికాలో ఉబెర్ డేటా బ్రీచ్ కలకలం ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంపై శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం!

23న నెల్లిమర్ల నగర పంచాయతీ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
23న నెల్లిమర్ల నగర పంచాయతీ నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారం

 కమిషనర్ టి గోవిందరావు

నెల్లిమర్ల, నవంబరు 22 :

​నెల్లిమర్ల నగర పంచాయతీ రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న నూతన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం  నిర్వహించనున్నట్లు  నగర పంచాయతీ కమిషనర్ టి.గోవిందరావు అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 18న దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది.
ఈ నెల 23న కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం  వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు.
​ఎన్నిక పారదర్శకంగా జరిగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తిగా చేతులెత్తే పద్ధతి ద్వారానే నిర్వహించనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
​కొత్త కౌన్సిల్ కొలువుదీరుతుండటంతో నెల్లిమర్ల పట్టణంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైస్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.