15 నుంచి చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు నిలుపుదల
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
చించినాడ బ్రిడ్జిపై రహదారి పూర్తి వెడల్పున చేపట్టనున్న నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అన్ని వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఎటువంటి వాహనాలను బ్రిడ్జిపై అనుమతించబోమని స్పష్టం చేశారు.
జిల్లా ప్రజలు, వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను ముందుగానే గమనించి తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు కొనసాగించాలని కోరారు.