BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

11వ తేదీ నుండి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం:తూనుగుంట్ల

Select Suryaa Now
11వ తేదీ నుండి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం:తూనుగుంట్ల

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
దసరా ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రమైన భట్టిప్రోలులో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 11వ తేదీ నుండి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కమిటీ అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10 విశేష అలంకారములతో అమ్మవారు భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకునే దసరా ఉత్సవాలలో శక్తి స్వరూపిణి, జగన్మాత, పరమశివుని అంశతో జన్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జరిగే పవిత్రమైన, శక్తివంతమైన, నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించిన భక్తులకు సర్వం శుభాలు కలుగుతాయని సాయిబాబా పేర్కొన్నారు.పది రోజులు పాటు జరిగే ఈ మహోత్సవాలలో విశేష పూజలు మరియు ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారుఈ మహోత్సవాల అంకురార్పణ సందర్భంగా కలశ స్థాపన, మండపారాధన, అఖండ జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.ప్రతిరోజు దేవాలయంలో అమ్మవారికి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు. పది రోజులపాటు నిత్యం లక్కి డీప్ ప్రైజులు ప్రకటించబడతాయన్నారు. ఈ సమావేశంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి ఆలపాటి ఉపేంద్ర, కోశాధికారి మాజేటి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.