BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

Select Suryaa Now
108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

మార్టూరు, మేజర్ న్యూస్:

పురిటి నొప్పులతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి 108 అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది తల్లీబిడ్డకు సురక్షితంగా ప్రసవం చేయడంతో ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన గుర్రపుశాల విష్ణుప్రియకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను చిలకలూరిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు తీవ్రతరమయ్యాయి. పరిస్థితిని గమనించిన 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఆర్. ప్రసాద్ రావు, పైలట్ రవిచంద్ర సహాయంతో అంబులెన్స్‌లోని డెలివరీ కిట్‌ను ఉపయోగించి సురక్షితంగా ప్రసవం చేశారు. విష్ణుప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డకు అవసరమైన వైద్యపరమైన ప్రాథమిక పరిచర్యలు అందించి, సురక్షితంగా చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డల క్షేమానికి కృషి చేసిన 108 సిబ్బందిని యద్దనపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీహర్షతో పాటు విష్ణుప్రియ కుటుంబ సభ్యులు అభినందించారు.