|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 12:57 PM
అమీన్పూర్ :మల్లన్న స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని జానకంపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్ పాండు, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.