|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 01:53 PM
కింగ్ నాగార్జున తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతున్నారు. తన 100వ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మొదట టబు నటించనున్నారని వార్తలు రాగా ఆమె తప్పుకున్నారని సమాచారం. ఆమె స్థానంలో నయనతారను తీసుకునే యోచనలో ఉన్నట్లు టాక్. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా నటించనున్నారని ఇది యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలయికగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Latest News