|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 03:36 PM
హనుమాన్ యొక్క పాన్-ఇండియా విజయం తర్వాత ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి తన మూడవ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. 'మహాకాళి' అనే టైటిల్‌తో ఈ చిత్రం భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా గుర్తించబడింది. బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం వివక్ష, అంతర్గత బలం మరియు ఒకరి గుర్తింపును తిరిగి పొందడం వంటి అంశాలను అన్వేషిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని రేపు అంటే సెప్టెంబర్ 30న ఉదయం 10:08 గంటలకి రివీల్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక బృందంలో సంగీతానికి స్మరన్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల మరియు క్రియేటివ్ డైరెక్టర్‌గా స్నేహ సమీర ఉన్నారు. భారతీయ మరియు విదేశీ భాషల్లో విడుదల చేస్తున్న మహాకాళి IMAX 3Dలో విడుదల కానుంది. పూజ అపర్ణ దర్శకత్వం వహించారు మరియు RKD స్టూడియోస్‌లో రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ సినిమని నిర్మించారు.
Latest News