BREAKING
గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.… ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..!

యువకుడి దారుణ హత్య

Select Suryaa Now
యువకుడి దారుణ హత్య

ఎదురుగడ్డలో యువకుడి దారుణ హత్య
- విచక్షణారహితంగా దాడి

కొత్తగూడెం క్రైమ్, సూర్య (మేజర్ న్యూస్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో యువకుడు ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో యువకుడిని దారి కాచి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. యువకుడి ఒంటిపై 15 కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. చనిపోయిన యువకుడు అఖిల్ (21)గా గుర్తించారు. అఖిల్ ఎదురుగడ్డలోని స్థానికంగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉంటున్న యువకులు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల ఆధిపత్య పోరులో అఖిల్ ను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడిపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సంఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.  ఆదివారం అర్ధరాత్రి అఖిల్ కి స్థానిక యువకులకు మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ హత్య జరగడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని పలువురు భావిస్తున్నారు.