BREAKING
గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.… ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..!

విద్యుత్ వైర్లు, లైట్ల చోరీ

Select Suryaa Now
విద్యుత్ వైర్లు, లైట్ల చోరీ

సూర్య గంగాధర ;గంగాధర నాగిరెడ్డిపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు, ఎల్‌ఈడీ లైట్లు, ఒక ఐమాక్స్ బల్బును గుర్తుతెలియని వ్యక్తులు  రాత్రి సమయంలో దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల ప్రకారం గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఊరి చివరి నుండి సమీపంలో ని వాగువద్ద గల ఎల్లమ్మ గుడివరకు సర్పంచ్ యశోద బాబు ఆధ్వర్యంలో  విద్యుత్ వైర్లు, ఎల్‌ఈడీ లైట్లు, ఐమాక్స్ బల్బును ఏర్పాటు చేశారు. ఆదివారం బతుకమ్మల నిమజ్జనం అనంతరం దొంగతనం జరిగినట్లు పేర్కొన్నారు. పండుగ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సామగ్రితో పాటు  కాపర్ కూడా దొంగిలించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామ సమీపంలోని నీటి కాలువ వద్ద మోటార్లకు సంబంధించిన విద్యుత్ వైర్లు సైతం చోరీకి గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వరుసగా ఇలాంటి చోరీలు జరుగుతుండటంతో గ్రామస్థులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.దాదాపు 20వేల వరకు ఉంటుందని అంచనా 
బతుకమ్మ పండుగ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సామగ్రిని, రైతుల మోటార్లకు సంబంధించిన వైర్లను దొంగిలించడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు ఈ ఘటనలపై దృష్టి సారించి, చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో నిఘా పెంచి, విద్యుత్ సామగ్రికి భద్రత కల్పించాలని నాగిరెడ్డిపూర్ గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.