విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం …ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ కు ఫిట్స్ …క్లీనర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం …
నర్సాపూర్; ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు లో ప్రయాణిస్తున్న విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. సాయంత్రం పాఠశాల సమయం అయిపోయాక విద్యార్థులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లడానికి బస్సు ఎక్కారు. బస్సు డ్రైవర్ ప్రభాకర్ బస్సును తోలుతూ కొద్ది దూరం రాగానే ఫిట్స్ కు గురయ్యాడు. దాంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఆటో, ఒక ద్విచక్ర వాహనాలను వేగంగా గుద్దుకుంటూ బస్సు ముందుకు సాగింది. ఓ బైక్ బస్సు చక్రాల కింద పడడంతో బస్సు వేగం తగ్గింది. బస్సులో ఉన్న క్లీనర్ అప్రమత్తమై బస్సును పూర్తిగా నిలిపివేశాడు. ఈ ప్రమాదంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురై ఏడుపులతో ఆహాకారాలు చేశారు. ఇది గమనించిన అక్కడ ఉన్న స్థానికులు బస్సులోని విద్యార్థులను కిందికి దింపివేశారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 18 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేని డ్రైవర్ను విధుల్లో పెట్టుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.